కె.విశ్వనాథ్కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

 కె.విశ్వనాథ్కు  మెగాస్టార్ బర్త్ డే విషెస్

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్కు బర్త్డే విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్ లో విశ్వనాథ్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్ అన్నారు. విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా ఓ ఆణిముత్యం అన్నారు. తెలుగు సినిమా చరిత్రను ‘శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత’ అనేలా చేసిన విశ్వానాథ్ తెలుగు సినిమాకు దక్కిన వరం అన్నారు. ‘మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. మీరు కలకాలం ఆయరారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.