మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ చిరు

మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ చిరు

మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటాడు. చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఆపడలో ఉన్నారని తెలిసిన వెంటనే తనవంతు సాయం అందిస్తుంటాడు. ఇప్పటికే ఎంతో మంది కళకారులకు, సాంకేతిక నిపుణులకు ఆయన వంతు సాయం అందించి మానవ్వతాన్ని చాటుకున్నాడు. తాజాగా సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ అనారోగ్యం పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న చిరు ఆయనకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశాడు.

దేవరాజ్ ఇటీవల ఓ మీడియా ఛానెల్ లో తన ఆరోగ్య పరిస్థిని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మేజర్ యాక్సిడెంట్ జరిగిందని.. అప్పటి నుంచి సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకి రోజు గడవడమే కష్టంగా ఉందనీ.. మందులకు కూడా డబ్బులు కూడా లేవని తన దీన స్థితిని వెల్లబుచ్చాడు. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ విషయం చిరు దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన దేవరాజ్ ను కలిసి ఆర్ధిక సాయంగా అందించారు. ఇక దేవరాజ్ తెలుగుతో పాటు పలు భాషల్లో ఆయన 300 సినిమాలకి పైగా పనిచేశారు. అంతేకాదడు చిరంజీవి నటించిన నాగు, రాణి కాసుల రంగమ్మ, పులి బెబ్బులి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేశాడు.