
కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటూ, కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరు. రీసెంట్‌గా ‘కూలీ’లో నెగిటివ్ రోల్‌లో మెప్పించిన ఆయన.. లేటెస్ట్గా తన ల్యాండ్ మార్క్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. ఆయన నటించనున్న వందో సినిమాను దసరా ముహూర్తాన ప్రారంభించబోతున్నారు.
అక్టోబర్ 2న అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెడుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారట నాగార్జున. చిరంజీవి క్లాప్‌తో ఈ మూవీ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారు. చిరుతోపాటు పలువురు స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది.
తమిళ దర్శకుడు రా.కార్తీక్ రూపొందించనున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
డైరెక్టర్ కార్తీక్..:
గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు. కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిండంతోనే వందో మూవీ బాధ్యతలు అప్పగించినట్లు సినీ వర్గాల్లో టాక్.
అయితే, రీసెంట్ టైమ్స్ వరకు.. నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు కూడా బాగా వినిపించాయి. కానీ, వారెవ్వరికి కాకుండా తమిళ డైరెక్టర్ కార్తీక్కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇపుడు విశేషంగా మారింది.
ప్రస్తుతం ఓజీ బ్యూటీ ప్రియాంక లీడ్ రోల్‌లో కార్తిక్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఓటీటీ కోసమే తీస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది. రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావచ్చి నట్టు తెలుస్తోంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.