కరీనా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిరు

కరీనా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిరు

‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను..వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ రూప పాత్రలో నటించింది.. తాజాగా ఈ చిత్రం నుంచి కరీనా ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు.

ఇక ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ ఇదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' చిత్రాన్ని చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన అనంతరం చిరు.. ఆమిర్ ఖాన్ ను హత్తుకొని అభినందించారు. మెగాస్టార్ స్పందనతో ఆమిర్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. కాగా, ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.