కొడాలి నాని.. పకోడీ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ ఆందోళన

కొడాలి నాని.. పకోడీ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ ఆందోళన

మెగాస్టార్ చిరంజీవిపై మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు దిగారు. గుడివాడలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌ నేతృత్వంలో మెగా అభిమానులు ఆందోళన చేపట్టారు. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెగా అభిమానులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి కొడాలి నాని మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను అడ్డుకోవడం సరికాదని పోలీసులతో మెగా అభిమానులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్ తోపాటు పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు. 

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చిరంజీవిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు కూడా మండిపడుతున్నారు. చిరుపై కొడాలి పకోడీ గాళ్లు వ్యాఖ్యల్ని నిరసిస్తూ గుడివాడలో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.