మేఘ్​ మహర్ : ఆటలతో పాటు పడవ పందాలు

మేఘ్​ మహర్ :  ఆటలతో పాటు పడవ పందాలు

ఎక్కడికైనా టూర్​కి వెళ్తే ఆ ట్రిప్​ జీవితాంతం గుర్తుండాలి అనుకుంటారు టూరిస్ట్​లు. అందుకనే గిరిజనులు ఉండే కొండ ప్రాంతాల టూర్లకు పోతారు చాలామంది. వాళ్ల కట్టుబొట్టు గురించి తెలుసుకుంటారు. అలాంటివాళ్లకు గుజరాత్​లోని సపుతర హిల్​స్టేషన్​ మంచి ఆప్షన్​. ఈ సీజన్​లో అక్కడ ‘మేఘ్​ మహర్​’ అనే ఫెస్టివల్ జరుగుతుంది.  

గుజరాత్​ టూరిజం డిపార్ట్​మెంట్ ఈ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇక్కడికి వెళ్తే గుజరాతీ కల్చర్​లో భాగం కావొచ్చు. ఈ ఫెస్టివల్ స్పెషల్​ ఏంటంటే... ప్రతి వీకెండ్, సెలవు రోజుల్లో సెలబ్రిటీ సింగర్స్​, ఆర్టిస్ట్​లతో కల్చరల్​ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమినాడు ఆగస్టు 19న ‘దహీ హండీ’ పోటీలు పెడతారు.  

ఆటలతో పాటు పడవ పందాలు

సాకర్​ గేమ్​తో పాటు వర్షం లో మారథాన్​లో పరుగెత్తొచ్చు. ఆర్ట్​గ్యాలరీలో పెయింటింగ్స్​, ఆర్ట్​వర్క్స్​ని చూడొచ్చు. సపుతర ప్రాంతంలోని వంటకాల్ని టేస్ట్​ చేయొచ్చు. అంతేకాదు చెట్లు, కొండలతో ఉండే ఆ ప్లేస్​లో ట్రెజర్​ హంట్​ గేమ్స్​ కూడా ఆడొచ్చు. ఇవేకాకుండా ఫొటోగ్రఫీ వర్క్​షాప్స్​​, పెయింటింగ్, వెదురు పోచలతో బుట్టలు, చాపలు అల్లడం, కుర్చీలు, ఉయ్యాల తయారుచేయడం నేర్చుకోవచ్చు. పడవ పందాలు, క్విజ్​ పోటీలు, సెమినార్స్​, ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రశాంతత కోసం యోగా క్లాసులు ఉంటాయి. జూన్ 30వ తేదీన ​ మొదలైన ఈ ఫెస్టివల్ఈ నెల 30న ముగుస్తుంది.