
సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరోనే. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వందల మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్(Heart Operations) చేయిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన మాత్రమే కాదు తన ఫ్యామిలీ అంతా కూడా ఈ ఫౌండేషన్ లో భాగమై తమ సేవలను అందిస్తున్నారు.
తాజాగా ఆయన కుమారుడు గౌతమ్ కూడా తన తండ్రి బాటలోనే నేను అంటూ ప్రూవ్ చేశారు. ఇటీవల గౌతమ్ రెయిన్‌బో హాస్పిటల్స్ ని సందర్శించి అక్కడ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారులను పలకరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలని గౌతమ్ తల్లి, మహేష్ బాబు సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. మహేష్ బాబు ఫౌండేషన్స్ లో భాగమైన గౌతమ్ కార్డియో, ఆంకాలజి వార్డుల్లో ఉన్న చిన్నారులతో అప్పుడప్పుడు ఇలా సమయాన్ని గడుపుతాడు. ఆ పిల్లలు కోలుకుంటున్నప్పుడు కలిసి వారికి మనో ధైర్యాన్ని అందిస్తాడు. వారి ముఖాల్లో నవ్వులు నింపుతాడు. ఇందుకు గౌతమ్ నీకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు.
ఇక ఇది చూసిన మహేష్ అభిమానులు, నెటిజన్లు గౌతమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి బాటలోనే తనయుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం గౌతమ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.