మెహ్లి మిస్త్రీకి నిరాశ.. టాటా ట్రస్ట్స్‌‌‌‌ లో దక్కని చోటు

మెహ్లి మిస్త్రీకి నిరాశ.. టాటా ట్రస్ట్స్‌‌‌‌ లో దక్కని చోటు

ముంబై: టాటా ట్రస్ట్స్‌‌‌‌లో విభేదాలు మరింత పెరిగాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీని నియంత్రించే ఈ సంస్థలో రతన్ టాటా సన్నిహితుడు, వ్యాపారవేత్త మెహ్లి మిస్త్రీకి చోటు దక్కలేదు. ఆయనను మరోసారి ట్రస్టీగా నియమించడాన్ని ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా,  ఆయనకు సన్నిహితులైన మరో ఇద్దరు ట్రస్టీలు అడ్డుకున్నారు. నోయల్ టాటా, టీవీఎస్​ మోటార్ కో– ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్,  రక్షణశాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్.. మిస్త్రీ పునర్నియమాకాన్ని వ్యతిరేకించారు.

సిటీబ్యాంక్​ ఇండియా మాజీ సీఈఓ ప్రమిత్ జవేరి, న్యాయవాది డేరియస్ ఖంబటా,  సమాజ సేవకుడు జహంగీర్​ ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.  ట్రస్ట్స్‌‌‌‌లో నోయల్ టాటా, మెహ్లి మిస్త్రీలు రెండు పవర్ సెంటర్లుగా మారారు.

 ట్రస్టీల పునర్నియమాకం ఆటోమేటిక్‌‌‌‌గా జరుగుతుందా లేదా ఏకగ్రీవ ఆమోదం అవసరమా ? అనే విషయంలో రెండు వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది రతన్ టాటా మరణానంతరం జరిగిన సమావేశంలో అన్ని ట్రస్టీ పదవులను జీవితకాలం చేయాలని నిర్ణయించారు.