
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. మేకపాటి మరణవార్త విని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మేకపాటి గౌతమ్ రెడ్డి లోటు తీర్చలేనిదన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘సహచరుణ్ని కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిది. గౌతమ్ రెడ్డి లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’ - ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. – మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం తీవ్రంగా కలచివేసింది. పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరం. మేకపాటి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. సమర్థవంతమైన మంత్రిగా గుర్తింపు పొందిన గౌతంరెడ్డి అకాల మరణం చెందడం బాధాకరం. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం చాలా బాధాకరం. చిన్న వయసులోనే గుండె పోటుకు గురై మృతి చెందడం తీవ్ర విచారకరం, బాధాకరం. గౌతంరెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి. – మంత్రి కొప్పుల ఈశ్వర్
దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిది. గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్‌కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతం రెడ్డి... రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - ఏపీ మంత్రి ధర్మాన
మరికొన్ని వార్తల కోసం:
నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు