
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. బాలీవుడ్ సినిమాల సన్నివేశాలను వీరి విందుతో కోట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
1997లో విడుదలైన ‘ఇష్క్’ మూవీలోని సదాశివ్ అమ్రాపూర్కర్ సన్నివేశాన్ని వాడారు. దీనికి ‘మునీర్‌ను కలిసిన తర్వాత ట్రంప్’అని క్యాప్షన్‌ను జోడించారు.
అనిల్ కపూర్, అమ్రిష్‌పురి నటించిన ‘రిష్తే’ సినిమా నుంచి ‘నువ్వు జీవితంలో ఇలాంటి కేక్‌ను చూసి ఉండవు.. ఈ రోజు నీకు దాని రుచి చూపిస్తాను’అంటూ కేక్‌ను బలవంతంగా తినిపించే సీన్ తోపాటు ఇతర సినిమాల్లోని కామెడీ సీన్లతో ట్రంప్ పై చేసిన మీమ్ లు నవ్వులుపూయిస్తున్నాయి.