14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుంటే యావజ్జీవ శిక్ష : హిమంత బిస్వాశర్మ

14 ఏళ్లలోపు  బాలికలను పెళ్లి చేసుకుంటే యావజ్జీవ శిక్ష : హిమంత బిస్వాశర్మ

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు వయసున్న బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధిస్తామని ప్రకటించింది. 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుంటే బాల్య వివాహాల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటామని చెప్పింది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి బాల్య వివాహాలే ప్రధాన కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ అభిప్రాయపడ్డారు. వాటిని నిరోధించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులను బాల్య వివాహాల నిషేధ అధికారులుగా నియమిస్తామని చెప్పారు. ఇక నుంచి బాల్య వివాహాల గురించి ఎవరి దృష్టికి వచ్చినా ఆ విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని అన్నారు.