మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి .. బోయిన్‌‌‌‌పల్లి అనాథాశ్రమంలో దారుణం

మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి .. బోయిన్‌‌‌‌పల్లి అనాథాశ్రమంలో దారుణం

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్​ నగరం బోయిన్‌‌‌‌పల్లి పోలీస్ స్టేషన్  పరిధిలోని ఓ అనాథాశ్రమంలో మతిస్థిమితం లేని యువతిపై లైంగికదాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు గర్భవతి కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

అనాథాశ్రమంలో గతంలో పని చేసిన మధ్యప్రదేశ్‌‌‌‌కు చెందిన రాజు మానసిక వికలాంగురాలిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల ఆశ్రమం నిర్వాహకులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. నిందితుడు రాజు నాలుగు నెలల కింద ఉద్యోగం మానేసి వెళ్లిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.