ఆసిఫాబాద్, వెలుగు: మతిస్థిమితం లేని వ్యక్తి ఆసిఫాబాద్ డీఎస్పీ ఆఫీసుపై దాడి చేసి కారు, ఫర్నిచర్ధ్వంసం చేశాడు. ఆసిఫాబాద్ జిల్లా రహపల్లి గ్రామానికి చెందిన సంజయ్కుమార్ఎంబీఏ(25) చేశాడు. ప్రేమ విఫలమవడంతో కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. గురువారం పేరెంట్స్అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని కొట్టబోయాడు. పోలీసులకు చెబుతామని పేరెంట్స్బెదిరించారు. దీంతో నేనే పోలీస్‌స్టేషన్‌కు పోతానంటూ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ఆఫీసుకు చేరుకున్నాడు. అక్కడున్న బండలతో పార్కింగ్ లో ఉన్న పోలీసుల కారు అద్దాలను పగలగొట్టాడు. పోలీసులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారికి చిక్కకుండా డీఎస్పీ చాంబర్ లోకి దూసుకెళ్లాడు. అక్కడ ఫర్నిచర్ధ్వంసం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంజయ్‌ను హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ కు పంపిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.
