శంషాబాద్లో అక్రమంగా మెఫేంటర్ మైన్సల్ఫేట్ ఇంజన్లు అమ్మకం.. ఇద్దరు అరెస్ట్

శంషాబాద్లో అక్రమంగా మెఫేంటర్ మైన్సల్ఫేట్ ఇంజన్లు అమ్మకం.. ఇద్దరు అరెస్ట్

రంగారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా మెఫేంటర్ మైన్సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంఘిగూడ వద్ద ఇంజన్లను విక్రయిస్తుండగా పహడీ షరీఫ్ కు చెందిన మహ్మద్ అజాజ్(29), మహ్మద్ అక్రమ్ (25) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

ఒక్కో ఇంజక్షన్ రూ. 200 లకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్లో రూ.1500 నుంచి 2000 వరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ ముఠానుంచి రూ. 2లక్షల 41 వేల విలువైన 30 మెఫేంటర్ మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.  

ప్రధానంగా ఈ ఇంజక్షన్లను బాడీ బిల్డర్లు ఎక్కువ శక్తి వినియోగించకుండా అతి తక్కువ సమయంలో బాడీ మజిల్స్ ను పెంచుకోవడానికి వినియోగిస్తారు. ఇంజక్షన్లను ఎక్కువగా వినియోగించడం ద్వారా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఇన్సోమనియా, డ్రోసైనస్ లాంటి దుష్పరిణామాలు కూడా ఏర్పడతాయిని తెలుస్తోంది.