మెర్సిడెస్ సీఎల్‌‌ఈ కాబ్రియోలెట్‌‌లో కూపే లాంచ్‌‌

మెర్సిడెస్ సీఎల్‌‌ఈ కాబ్రియోలెట్‌‌లో కూపే లాంచ్‌‌

మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో ఏఎంజీ సీఎల్‌‌ఈ 53 4మాటిక్‌‌+ కూపేను రూ.1.35 కోట్ల ఎక్స్‌‌షోరూమ్ ధరకు లాంచ్ చేసింది.  ఇది గత సంవత్సరం వచ్చిన సీఎల్‌‌ఈ కాబ్రియోలెట్‌‌కు కూపే వెర్షన్. సీఎల్‌‌ఈ 300 కాబ్రియోలెట్ కంటే ఇది పై స్థాయిలో ఉంటుంది. స్పోర్టీ,  హై-పర్ఫార్మెన్స్ మోడల్‌‌గా ఇది నిలుస్తుంది. 3.0 లీటర్ ట్విన్-టర్బో ఇన్‌‌లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌‌తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.  442 బీహెచ్‌‌పీ పవర్‌‌‌‌ను,  560 ఎన్‌‌ఎం టార్క్‌‌ను  ఉత్పత్తి చేస్తుంది.