
జ్యోతిష్యం ప్రకారం, బుధుడిని తెలివితేటలు, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. బుధుడు మే 23వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 1:05 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు .. వృషభరాశిలో 21 రోజుల పాటు సంచరిస్తాడు. దీని కారణంగా 12 రాశుల వ్యక్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం.
మేషరాశి: ఈ రాశి వారికి బుధుడు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. అయితే ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండా ఖర్చులు వస్తాయి. సమాజంలో గౌరవం ... కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి సంబంధం చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు పొందుతారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. అదనపు ఖర్చులు కొంత ఆందోళనకు గురి చేస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి : బుధుడు.. వృషభ రాశిలో సంచారం చేయడం వలన ఈ రాశివారికి అనేక ప్రయోజనాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
సింహరాశి: ఈ రాశి వారికి ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సీనియర్ అధికారులు .. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త దంపతులు ఎంజాయి చేస్తారు. కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్యారాశి: బుధుడు.. వృషభరాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీలక భాద్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. ప్రేమ వ్యహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి: ఈ రాశి వారికి ఊహించని ఖర్చులు వస్తాయి. ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగులు మోసం చేసే అవకాశం ఉంది. ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూవెళ్లండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. తోబుట్టువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. పూర్వీకుల ఆస్తి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. కాలమే మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎలాంటి ఆందోళన పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లండి.
ధనుస్సు రాశి: వృషభ రాశిలో బుధ సంచారం కారణంగా ఈ రాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వీరి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. పనిచేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మకరరాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. వృత్తి.. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. పట్టుదల, సహనం, వ్యూహం వంటి లక్షణాలతోఅన్ని విధాలుగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
కుంభరాశి: ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా బాగుటుంది. చేతి వృత్తుల వారు గొప్ప అవకాశాలను పొందుతారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ 21 రోజులు మంచి సమయం. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి మధ్యవర్తిత్వం ఉండవద్దు. ష్యూరిటీలు ఉండటం కాని.. అప్పులు ఎట్టి పరిస్థితిలో చేయవద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఆందోళనను కలిగిస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వాదించవద్దు.