స్వాతంత్ర్య స్మారకానికి ప్రతి ఊరి నుంచి మట్టి

స్వాతంత్ర్య స్మారకానికి ప్రతి ఊరి నుంచి మట్టి

హైదరాబాద్, వెలుగు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ‘మేరీ మిట్టీ.. మేరా దేశ్’ (నా మట్టి.. నా దేశం) బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశం లో కమిటీ కన్వీనర్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్, కో ఆర్డినేటర్ కాసం వెంక టేశ్వర్లు, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తది తరులు పాల్గొన్నారు. 

క్విట్ ఇండియా దినోత్సవం రోజైన ఈ నెల 9న ప్రారంభిం చి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్ర మాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణ యించారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం, ఈ నెల 13 నుంచి 15 వరకు వాడవాడలా జాతీయ జెండా ఎగరేయడం, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్మిస్తున్న స్మారక స్తూపానికి ప్రతి ఊరి నుంచి మట్టి పంపించడం వంటి కార్యక్రమాలు చేపట్ట నున్నారు. 30న ఢిల్లీలో ప్రధాని మోదీ ఏర్పా టు చేసిన ప్రత్యేక మీటింగ్​కు ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి ఇద్దరు కార్యకర్తలను పంపించనున్నారు.