- ఇరాక్‌లో రోడ్డు ప్రమాదంలో చింతగూడ వాసి..
మెట్‌పల్లి, వెలుగు : ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన అల్లె రామస్వామి (47) టైలర్ పనిచేసే వాడు. మూడేండ్ల కింద ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని రియాద్ వెళ్లాడు. ఈ నెల 17న పనిచేసే ప్రాంతంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు రామస్వామిని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. దీంతో మెట్‌పల్లిలోని రామస్వామి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రామస్వామి డెడ్‌బాడీని గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
ఇరాక్‌లో చింతగూడ వాసి...
జన్నారం, వెలుగు : ఉపాధి కోసం ఇరాక్వెళ్లిన జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు (35) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఏడేండ్ల కింద ఇరాక్ వెళ్లిన రాజమల్లు అక్కడ కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయాన్ని తోటి కార్మికులు గురువారం కుటుంబసభ్యులు సమాచారం అందించారు. రాజమల్లు డెడ్‌బాడీని గ్రామానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.