రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే కొద్ది గంటల్లో మరిన్న ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం కారణంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాన  దంచికొట్టింది.. ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురిసింది.ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాదు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

జంట నగరాల్లోని వారాసిగూడ, రాంనగర్, సికింద్రాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట్, బంజారా హిల్స్, మెహిదీపట్నం తదితరల ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురవగా, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్ బి నగర్, చింతల్ కుంట, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

ఈ రోజు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో 95 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‎లో 78.5 మిమీ, హైదరాబాద్ జిల్లా అంబర్ పేటలో 77.8 మిమీ, రంగారెడ్డి జిల్లా షాబాద్‎లో 69.5 మిమీ, మంచాల మండలం ఆరుట్లలో 68.5 మిమీ వర్షాపాతం నమైదైంది.