నాపై నమోదైన ఎఫ్​ఐఆర్ క్వాష్ చేయండి: కేటీఆర్​

నాపై నమోదైన ఎఫ్​ఐఆర్ క్వాష్ చేయండి: కేటీఆర్​
  • డ్రోన్ కేసులో హైకోర్టుకు కేటీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మేడిగడ్డ పర్యటన సందర్బంగా అనుమతులు లేకుండా డ్రోన్ ఉపయోగించారని పేర్కొంటూ మహాదేవ్ పూర్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. 

తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.