15మంది మహిళలపై లైంగిక దాడి చేసి.. పైగా పరువు నష్టం దావానా?

15మంది మహిళలపై లైంగిక దాడి చేసి.. పైగా పరువు నష్టం దావానా?

సర్ 15మంది తమపై లైంగిక దాడులు జరిగిందని ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఆనంద పడాలి. అంతేకాని తన పరువుకు భంగం కలిగిందంటూ నష్టపరిహారం చెల్లించాలని మాజీ కేంద్రమంత్రి తమపై వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టడం సరికాదని అన్నారు ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి.

23ఏళ్ల క్రితం మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పలు మీడియా సంస్థల్లో ఎడిటర్ గా పని చేశారు. ఆ సమయంలో మహిళా రిపోర్టర్లని లైంగిక వేధించారు. అయితే 2018 తను శ్రీ దత్త మీటూ ఉద్యమంతో పాటు ఎంజే అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్ట్ లు ఒక్కసారిగా తమగళం విప్పారు. అక్బర్ ఎడిటర్ గా పనిచేస్తున్న సమయంలో తమ స్విమ్మింగ్ పూల్ లో లైంగిక వేధించారంటూ పలువురు మహిళా జర్నలిస్ట్ లు తమకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వారిలో జర్నలిస్ట్ ప్రియా రమణి కూడా ఉన్నారు.

జర్నలిస్ట్ లు ఆరోపణలు చేసిన రెండు రోజుల తరువాత అక్బర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. నాకు ఈత కొట్టడమే రాదు. అలాంటి నేను స్విమ్మింగ్ పూల్ లోకి ఎలా దిగుతాను. జర్నలిస్ట్ లను లైంగికంగా ఎందుకు వేదిస్తాను. అంతా మా లాయరే చూసుకుంటారంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తన ప్రతిష్టకు భంగం కలిగించారని, తనకు న్యాయం చేయాలంటూ మహిళా జర్నలిస్ట్ లపై పరువు నష్టం దావా వేశారు.

తాజాగా పరువు నష్టంపై కేసులో జర్నలిస్ట్ ప్రియారమణి ఢిల్లీ కోర్ట్ కు హాజరయ్యారు. విచారణలో భాగంగా 15మంది మహిళా జర్నలిస్ట్ లపై లైంగిక దాడులు జరిగాయని బహిర్ఘతం చేయడం గొప్పవిషయం. అందుకు ధైర్యం కూడా కావాలి. కేసు విషయంలో ఎంజే అక్బర్ పరువునష్టం కంటే.., మహిళలు తమకు జరిగిన లైంగిక దాడి గురించి బహిర్ఘతం చేయడంపై సంతోషించాలి అంటూ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ఎదుట వాదించారు.

అంతేకాదు అక్బర్ పేరుప్రఖ్యాతులు ఎప్పటికీ శాశ్వతం కాదని తాము నిరూపించామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.