సాయంత్రం నుంచి ఈ స్టేషన్లలో మెట్రో బంద్

సాయంత్రం నుంచి ఈ స్టేషన్లలో మెట్రో బంద్

హైదరాబాద్‌: ప్రధాని మోడీ విజయ సంకల్ప సభ సందర్భంగా హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభ ఉండటంతో ఆదివారం మెట్రో స్టాప్ లపై కొన్ని మార్పులు చేశారు. ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్ , JBS మెట్రో స్టేషన్లు ఆదివారం సాయంత్రం 5.30 నుంచి  రాత్రి 8 గంటల మధ్య మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ టైమింగ్స్ లో మెట్రో  రైళ్లు ఈ స్టేషన్ల దగ్గర  ఆగవని.. కారిడార్ 2(JBS నుంచి-MGBS) రైళ్లు సికింద్రాబాద్ వెస్ట్ & MGBS మధ్య నడుస్తాయన్నారు. ప్రయాణికులు దీనిని గమనించాలని సూచించారు. కారిడార్ 1 (మియాపూర్- నుంచి ఎల్‌బి నగర్) రూట్ లో ఎటువంటి మార్పు లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అయితే మోడీ సభా క్రమంలో  రెండు రోజులపాటు మెట్రో రైల్లు నిలిచిపోనున్నాయని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం సాయంత్రం వరకు మూడు కారిడార్లలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో మాత్రమే ఈ మూడు స్టేషన్లలో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ క్లారిటీ ఇచ్చారు.