
హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పంచనామా రాస్తున్న పోలీసులను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (జులై 01) జరిగిన ఈ ప్రమాదంలో.. ఎస్సై రెండు కాల్లు విరగటంతో పరిస్థితి విషమంగా మారింది.
బాలానగర్ నుంచి కూకట్ పల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి పంచనామా చేస్తున్న పోలీసులను డీసీఎం ఢీకొట్టింది. దీంతో రాత్రి విధుల్లో ఉన్న ప్రొఫెషనల్ ఎస్సై వెంకటేశం కు తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు కాళ్ళు విరిగి పోవటంతో పరిస్థితి విషమంగా మారింది.
►ALSO READ | తమిళనాడులో భారీ పేలుడు..ఎనిమిది మంది మృతి, 12మందికి గాయాలు
ఘటన జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో కారు, డీసీయం డ్రైవర్లు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు