వచ్చే మార్చి నాటికి కొత్తగా 200 మెట్రో స్టోర్లు

వచ్చే మార్చి నాటికి కొత్తగా 200 మెట్రో స్టోర్లు

న్యూఢిల్లీ: చెప్పులు, షూస్ అమ్మే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్‌‌‌‌, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్తగా 200 స్టోర్లను ఓపెన్ చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఈ కంపెనీలో  సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ రాకేష్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలాకు వాటాలు ఉన్న విషయం  తెలిసిందే. వాక్‌‌‌‌వే, మెట్రో, మోచి బ్రాండ్లు ఈ కంపెనీకి చెందినవే. ప్రస్తుతం 170, 180 సిటీలలో  విస్తరించామని, ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ను 300 కు పెంచుకుంటామని కంపెనీ ప్రెసిడెంట్‌‌‌‌ (ఈ–కామర్స్‌‌‌‌) అలిషా మాలిక్ అన్నారు. ఆన్‌‌‌‌లైన్ ద్వారా సేల్స్ పెంచుకోవడంపై కూడా ఫోకస్ పెట్టామని వివరించారు.