ఢిల్లీ మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై

ఢిల్లీ మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై

ఇవాళ్టి(గురువారం,జనవరి-2) నుంచి ఢిల్లీ మెట్రో రైళ్లల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ మెట్రోలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ మొదటి సారిగా రైళ్లలో దీనిని ప్రారంభించింది.

ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్టు లైన్‌ మొత్తం ఆరు స్టేషన్లతో 22 కిలోమీటర్ల పొడవునా ఉంది. ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ను 2011లో ప్రారంభించారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. 2013 రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దీని నుంచి తప్పుకోగా.. డీఎంఆర్‌సీ పూర్తి వాటాను సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టు లైన్‌లోని ఆరు మెట్రోస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.