మెట్రో రైల్ టైమింగ్స్ పొడిగింపు

మెట్రో రైల్ టైమింగ్స్ పొడిగింపు

హైదరాబాద్ : సిటీ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ నుంచి రైలు టైమింగ్స్ ను మార్చిన మెట్రో అధికారులు.. రేప‌ట్నుంచి పాత టైమింగ్సే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఉద‌యం 6 గంట‌ల‌కే ఫస్ట్ మెట్రో రైలు ప్రారంభంకాగా.. రాత్రి 10:15 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్ నుంచి మెట్రో రైలు బ‌య‌ల్దేర‌నుందన్నారు. చివ‌రి రైలు గ‌మ్య‌స్థానానికి 11:15 గంట‌ల‌కు చేరుకోనుందని తెలిపిన మెట్రో అధికారులు ప్రయాణికులు ఈ టైమింగ్స్ ను గమనించాలన్నారు.

ట్విట్టర్ లో మంత్రి KTR కి ప్రయాణీకులు మెట్రో టైమింగ్స్ పెంచాలనే విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో రైల్ వేళలు పొడిగిస్తూ L & T మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు నిర్ణయించినట్లు ఎంవిఎస్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి మారిన మెట్రో టైమింగ్స్ అమల్లోకి వస్తాయన్నారు ఎంవిఎస్ రెడ్డి. ప్రస్తుతం ఉదయం ఏడింటికి ఫస్ట్ ట్రైన్ ప్రారంభమవుతుండగా....  చివరి ట్రైన్ రాత్రి పదింబావుకి క్లోజ్ అవుతోందన్నారు.