
- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి
హైదరాబాద్, వెలుగు: మత్స్యకారులను బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ సభని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు
. మత్య్సకారుల కుటుంబాలపై రాహుల్ గాంధీ వరాల జల్లు కురిపించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మత్య్సకారులకు బ్యాంక్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. బోట్స్‌కు అవసరమైన పెట్రోల్ , డీజిల్‌ను సబ్సిడీలో ఇవ్వనున్నట్టు వివరించారు.