57 కేజీల సన్నబియ్యంతో ..సీఎం రేవంత్ కు బర్త్ డే విషెస్

57 కేజీల సన్నబియ్యంతో ..సీఎం రేవంత్ కు బర్త్ డే విషెస్

హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి 57వ పుట్టిన రోజు సందర్భంగా 57 కిలోల సన్నబియ్యంతో చిత్ర పటం ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల కోసం తీసుకొచ్చిన ఉచిత సన్న బియ్యం పంపిణీకి గుర్తుగా ఇంటిపై ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన సాయికుమార్.. నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

దేశంలోనే తొలిసారి

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించన సంగతి తెలిసిందే. 2025 ఉగాది సందర్భంగా హుజూర్‌‌నగర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించారు. పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదికపైన సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.