- ఎంఎఫ్ హుస్సేన్ కళాఖండాల ప్రదర్శన
హైదరాబాద్సిటీ, వెలుగు: ఈ నెల 19 నుంచి 21 వరకు నానక్రామ్గూడలోని ఈయాన్ హైదరాబాద్లో మహా సాంస్కృతిక వేడుక హైడ్ ఆర్ట్– 2025 మహోత్సవం జరగనుంది. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా కళాకారులు ఈ వేదికలో తమ కళాఖండాలను ప్రదర్శించనున్నారు. అలాగే ఒక ప్రత్యేక ‘మాస్టర్స్ ఆఫ్ ఇండియా’ గ్యాలరీలో ఎం.ఎఫ్. హుస్సేన్, ఎస్.హెచ్. రజా వంటి ఆధునిక భారతీయ దిగ్గజాల అరుదైన కళాఖండాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
