V6 News

ఎంజీ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించండి

ఎంజీ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించండి

నల్గొండ, వెలుగు: నల్గొండ మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీలో బోధ‌న‌, బోధ‌నేత‌ర ఉద్యోగుల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బందిని క్రమబద్దీకరించడం, సమాన పనికి సమాన వేతనం అమలు, సీఏఎస్ ప్రమోషన్లు, పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ చెల్లింపులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఉద్యోగ భద్రత, ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగుల హక్కుల రక్షణను నిర్దారించాలన్నారు. డాక్టర్ చింత శ్యామ్ సుందర్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ శ్రీనివాస్, ఉమా కత్తుల, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అనిత, డాక్టర్లు పాల్గొన్నారు.