
ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంజీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో రూ.51 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ మల్టీ-పర్పస్ వెహికల్ (ఎంపీవీ) త్వరలో మనదేశంలో విడుదల కానుంది. ఇది 90 కిలోవాట్అవర్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకే చార్జ్‌తో దాదాపు 430 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. ధర రూ.65 లక్షల వరకు ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.