గొంతులో పిన్నీసు.. ఆపరేషన్ లేకుండానే...

గొంతులో పిన్నీసు.. ఆపరేషన్ లేకుండానే...

చిన్నపిల్లలు ఎక్కడున్నా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.  చంటిపిల్లలు చేతులు కాళ్లు.. చేతులు కదుపుతుంటారు.  వారిచేతుల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో గమనించాలి.  లేదంటే వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.   ఇప్పుడు అలానే.. ఓ పిల్లాడు ఆడుకుంటున్నాడని ఆ బాలుడి తల్లిదండ్రులు వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.  ఇక అంతే ఆ బాలుడి గొంతులో పిన్నీసు ఇరుక్కుపోయిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది.  

బర్మాకాలనీకి చెందిన గోపీనాథ్ కుమారుడు  బర్ఖావన్(2) ఆడుకుంటూ నోట్లో పిన్నీసు పెట్టుకున్నాడు.   పిన్నీసుగొంతులో గుచ్చుకోవడంతో గట్టిగాఅరిచాడు.  ఎంత సేపటికి ఏడుపు ఆపకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.  వైద్యులు ఎక్స్ రే తీయించగా గొంతులో పిన్నీసు ఉందని  గుర్తించి ఈఎన్ టీ డాక్టర్ అన్నామలై నేతృత్వంలోని వైద్య బృందం బాలుడికి ప్రథమ చికిత్స చేశారు. తరువాత ఎండోస్కోపీ ద్వారా గొంతులోని పిన్నీసును ఆపరేషన్ లేకుండానే తీశారు.