MI vs CSK: రుతురాజ్, దూబే ధనాధన్ బ్యాటింగ్.. భారీ స్కోర్ దిశగా చెన్నై

MI vs CSK: రుతురాజ్, దూబే ధనాధన్ బ్యాటింగ్.. భారీ స్కోర్ దిశగా చెన్నై

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ హోరీహోరీగా సాగుతోంది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుంటే.. చెన్నై బ్యాటర్లు అదే రీతిలో బదులిస్తున్నారు. వారి బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో ఉంచుకొని పరుగులు రాబడుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(39 బంతుల్లో 69 నాటౌట్), శివమ్ దూబే(27 బంతుల్లో 49 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరి దూకుడు చూస్తుంటే కింగ్స్.. ముంబై ఎదుట భారీ లక్ష్యం నిర్ధేశించడం ఖాయంగా కనిపిస్తోంది.