MI vs PBKS: సూర్య హాఫ్‌ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ముంబై 

MI vs PBKS: సూర్య హాఫ్‌ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ముంబై 

ముల్లన్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇషాన్ కిష‌న్(8) విఫలమైనా.. రోహిత్ శర్మ(36; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్య కుమార్ యాద‌వ్(55 నాటౌట్; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోడి పరుగుల వరద పారించారు. వీరిద్దరి దూకుడుకు ముంబై పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. 

ఆ తరువాత సూర్య దూకుడు మరింత పెంచాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వేగంగా ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ (36) వెనుదిరిగాడు. సామ్‌ కరన్ బౌలింగ్ లో హర్‌ప్రీత్‌ బ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి ముంబై స్కోర్.. 12 ఓవర్లు ముగిసేసరికి 101/2.