MI vs RR: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ పోరుకు వర్షం ముప్పు!

MI vs RR: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ పోరుకు వర్షం ముప్పు!

దేశమంతా ఎండలు దంచికొడుతుంటే.. వీరేంటి వర్షం అంటారు అని అనుకుంటున్నారా..! ఇది వాతావరణ శాఖ అధికారుల అంచనా అనమాట. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.  అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ముంబై మేఘావృతం

ఏప్రిల్ 1న దేశ ఆర్థిక రాజధానిలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అంచనా వేయబడింది. కనిష్టంగా 26 డిగ్రీలు, గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. AccuWeather ప్రకారం.. ఏప్రిల్ మొదటి రోజున ముంబైలో వర్షం కురిసే అవకాశం లేనే లేదు. అయితే, రాత్రి 7 గంటలకు టాస్ జరిగే సమయానికి, ఉష్ణోగ్రత 54% తేమతో 30 డిగ్రీలు ఉంటుందని అంచనా వేయబడింది. ఇంతకీ వర్షం పడుతుందా..! లేదా అంటే, వాతావరణ శాఖ అధికారులకే తెలియాలి.

అట్టడుగున ముంబై

ప్రస్తుత సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలయ్యారు. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి జోరు మీదుంది. 

జట్ల(అంచనా) 

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, రొమారియో షెఫర్డ్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్.