మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌‌గా సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌‌గా సత్య నాదెళ్ల

వాషింగ్టన్ డీసీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌‌గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల అతి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు చైర్మన్‌గా ఎంపిక చేయడం ద్వారా నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ మరిన్ని బాధ్యతలు అప్పజెప్పినట్లయింది. కాగా, ప్రస్తుత సంస్థ చైర్మన్ థాంప్సన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోయాక కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా సేవలందిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.