టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ జోడీ

టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ జోడీ

న్యూఢిల్లీ: అమెరికాలో టిక్‌‌‌‌టాక్ ఆపరేషన్స్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్‌‌‌‌తో వాల్‌మార్ట్ జతకట్టింది. ఈ రెండు కంపెనీలు కలిసి బిడ్ వేయనున్నాయి. అమెరికా టిక్‌‌‌‌టాక్ యూజర్ల అంచనాలను మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ భాగస్వామ్యం అందుకోనుందని కంపెనీలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్‌‌‌‌తో కలిసి టిక్‌‌‌‌టాక్ అమెరికాలో పాలుపంచుకోవడం ద్వారా తమ కస్టమర్లను చేరుకోనున్నామని వాల్‌మార్ట్ తెలిపింది. తమ థర్డ్ పార్టీ మార్కెట్‌ ‌‌‌ప్లేస్‌ అభివృద్ధి చెందేందుకు, అడ్వర్‌టైజింగ్ వ్యాపారాలు పెంచుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని పేర్కొంది. యాప్ భద్రతపై అమెరికా రెగ్యు లేటర్స్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా తాము తీర్చనున్నామని చెప్పింది. మరోవైపు టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ కంపెనీ నుంచే తప్పుకున్న విషయం తెలిసిందే.

For More News..

బార్డర్‌‌‌‌‌‌‌‌లో 5జీ నెట్ వర్క్ సిద్ధం చేస్తోన్న చైనా

కరోనా నివారణకు ఈ దూరం చాలదట

అమెరికాలో హరికేన్ లారా బీభత్సం