కరోనా కట్టడికి రూ.2.65 కోట్లిచ్చిన మిడ్ డే మీల్స్ కార్మికులు

కరోనా కట్టడికి రూ.2.65 కోట్లిచ్చిన  మిడ్ డే మీల్స్ కార్మికులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  కరోనాను కంట్రోల్ చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు మిడ్ డే మీల్స్ కార్మికుల సంఘం రూ.2.65 కోట్ల  విరాళం ప్రకటించింది. బుధవారం ఆ సంఘం ప్రెసిడెంట్ వడ్ల హనుమాండ్లు సీఎం కేసీఆర్ ను కలిసి లెటర్ ఇచ్చారు.  ప్రముఖ ఫార్మా సంస్థ  అరబిందో ఫార్మా  రూ.7.5 కోట్ల విరాళం ఇచ్చింది. ఆ సంస్థ వైస్ చైర్మన్, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసి చెక్కును అందజేశారు. రెండున్నర కోట్ల రూపాయలు విలువైన శానిటైజర్లు, రూ.కోటి విలువైన మందులు కూడా ఇస్తామని చెప్పారు. నవభారత్ వెంచర్స్ చైర్మన్ డి.అశోక్, సీఈవో వి.విక్రమ్ ప్రసాద్, ఈడీ నిఖిల్ రూ.2.5 కోట్లు, గ్రాండ్ ఫార్మా ఎండీ శ్రీనివాస్ రూ.కోటి విరాళం అందజేశారు. ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ డీవీఎస్ రాజు సీఎంను కలిసి  రూ. 50 లక్షల చెక్కును అందించారు.

గుడుంబా గుప్పుమంటాంది.. బీరు పొంగుతాంది