నేడు చలో కొదురుపాక…

నేడు చలో కొదురుపాక…

శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ గోడు వినిపించేందుకు సీఎం కేసీఆర్‌ అత్తగారి ఊరు కొదురుపాకను వేదిక చేసుకొని నేడు(శుక్రవారం) బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ముంపు గ్రామల ఐక్యవేదిక, అఖిలపక్షం నాయకులు సభకు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. ప్రాజెక్టుతో ముంపునకు గురైన 12  గ్రామాల నిర్వాసితులతో పాటు, మిడ్ ఆమ్నెర్ నిర్మించిన మన్వాడ, కందికట్కూర్ గ్రామాల ప్రజలు సైతం ఇందులో పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, ముంపుగ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్, మండల బీజేపీ నాయకుడు కోండం శ్రీనివాస్‌రెడ్డి తదితరు గురువారం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు దాదాపు 10 వేల నుంచి 12 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చలో కొదురుపాక పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర అఖిల పక్ష నేతలు హాజరవుతున్నారు. బీజేపీ నుండి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పార్టీ నేత ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోందండ రామ్, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టిడిపి నాయకుడు ఎల్.రమణ తదితరులు హాజరవుతున్నారు. ఉదయం 11  గంటలకు సభ ప్రారంభం అవుతుందని నేతలు పేర్కొన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి