సాయమందక మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

సాయమందక మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. బోయినిపల్లి మండలం నీలోజిపల్లిలో మిడ్ మానేరు నిర్వాసితుడు బిగుళ్ల బాబు (45) గుండె పోటుతో మృతి చెందాడు. మిడ్ మానేరులో ఇల్లు కోల్పోవడంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం బాబు అప్పు చేశాడు. ఉపాధి లేక పోవడం, అప్పుల బాధతో మానసికంగా బాబు కుంగిపోయాడని.. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆయన గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా.. నిర్వాసితులకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల 4 వేలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ హామీ అమలు కాకపోవడంతోనే తన భర్త చనిపోయాడని బాబు భార్య సంతోష.. జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం చేయాలని కోరింది. నిరుపేద బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్యవేదిక అధ్యక్షుడు రవీందర్ డిమాండ్  చేశారు.

For More News..