పట్నంల నడిరాత్రి దంచికొట్టిన వాన

పట్నంల నడిరాత్రి దంచికొట్టిన వాన

పట్నంల నిన్న సాయంత్రం, నడిరాత్రి వాన దంచికొట్టింది. రుతుపవనాల రాకతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం రాత్రి షేక్ పేటలో 9.4 సెం.మీ వర్షం పడింది. గచ్చిబౌలి 8.3 సెం.మీ, రాయదుర్గం 7.6 సెం.మీ,  మాదాపూర్ 7.6 సెం.మీ, ఆసీఫ్ నగర్ 6.7 సెం.మీ, జూబ్లీహిల్స్ 6.5సెం.మీ, మూసాపేట్ 6.4 సెం.మీ, టోలిచౌకి 6.3సెం.మీ, ఫిలింనగర్ 6.3సెం.మీ, కూకట్ పల్లి 5.6 సెం.మీ, బోరబండ 5.6 సెం.మీ, ఖైరతాబాద్ 5.4సెం.మీ, యూసఫ్ గూడ 5.3 సెం.మీ, శ్రీనగర్ కాలనీ 5 సెం.మీ, నాంపల్లి 4.9సెం.మీ, కొండాపూర్ 4.8సెం.మీ, మైత్రివనం 4.6సెం.మీ, కుత్బుల్లాపూర్ 4.2 సెం.మీ ల వర్షం పడింది.