ఉపాధి వలసొచ్చింది..

ఉపాధి వలసొచ్చింది..

మహబూబ్ నగర్‍, వెలుగు: ఉపాధిలేక సర్పంచ్‌ వలస వెళ్లిన ఘటనతో అధికారులు కదిలారు. ఆ ఊళ్లో అందరికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు . ఎర్రగుంట తండాలో గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద వంద రోజుల పనులకు ప్లాన్‌‌ రెడీ చేశారు. ఉపాధిలేని కుటుంబాలను గుర్తించి పనులు కల్పిస్తున్నామని, ఏరోజుకారోజే కూలీ చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు  నా రాయణపేట ఏపీడీ సరళాకుమారి చెప్పారు .కొత్తగా ఎన్నికయిన సర్పంచ్‌ పనులు లేక వలస వెళ్లడాన్ని సీరియస్‌ గా తీసుకున్న అధికారులు దిద్దుబాటు ప్రారంభిచారు . సర్పంచ్‌ సరోజాబాయిని గ్రామస్తులు వెనక్కి పిలిపించారు .తాను ఉపాధి లేక వలసపోయిన విషయం నిజమేనని ఆమె వివరించింది. తండాలో అందరికీ పనులు కల్పించాలన్న  ఉన్నతాధికారుల ఆదేశాలతో నారాయణపేట జిల్లా డ్వామా అధికారులు శుక్రవారం మద్దూరు మండలం ఎర్రగుంట తండాను సందర్శించారు. డ్వామా అసిస్టెం ట్‌ డైరెక్టర్‍ సరళకుమారి, అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌‌ కే .మొగులప్ప పంచాయతీ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సమావేశానికి సర్పంచ్‍ సరోజబాయి కూడా హజరయ్యారు. గ్రామంలో ఉపాధి లేని కుటుంబాలను గుర్తించి, వారికి వందరోజుల పాటు అదే గ్రామంలో పనులు కల్పించారు .

గ్రామంలో సాగునీరు, తాగునీరు కొరత ఉన్నందున భూగర్బ జలాలు పెరిగేలా పాం ఫౌండ్‍ల నిర్మాణం చేపడుతున్నారు . దీనివల్ల వర్షపు నీరు నిలువ ఉండటమే కాకుండా భవిష్యత్‍లో భూగర్బ మట్టం పెరుగుతుందని ఏపీడీ సరళకుమారి అన్నారు . పనులను గర్తించి కూలీలను అప్పగించామన్నారు. పనులు జరిగిన వెంటనే డబ్బులు చెల్లించేలా  చర్యలు తీసుకు న్నామన్నారు . గ్రామంలో ఉన్న 40 మందికి అక్కడే ఉపాధి కల్పించనున్నట్లు ఆమె చెప్పారు . గ్రామంలో పండుగ వాతవరణం..ఉపాధి కరువై కుటుంబాలకు కుటుం బాలే వలసబాట పట్టిన తండాలో అధికారులే స్వయంగా వచ్చి ఉపాధి కల్పించడం పట్ల అంతా సంతోషపడుతున్నారు . ఈ కథనం రాసిన వెలుగును గ్రామస్థులు అభినందిస్తున్నారు. అధికారులే ఇల్లిల్లు తిరిగి ఇక్కడే ఉపాధి కల్పించడం కోసం ముం దుకు రావడం తో గ్రామంలో పండగ వాతవరణం నెలకొం ది. ఇప్పటిదాకా పనికోసం ఎక్కడి పోతున్నారు , రోజుకు కూలీ ఎంత వస్తుం దన్న వివరాలు సేకరించారు .తెల్లవారకముందే చుట్టుపక్కల ఊళ్లకెళ్లినా పనులు దొరకడంలేదని,ఎప్పుడో పనులు దొరికితే అర్దరాత్రి వరకు తిరిగొచ్చే అవకాశం ఉండేదికాదని వాపోయారు. చాలా మంది ముం బాయికి వెళ్లిపోయారన్నారు . దీంతో ఉపాధి లేని కుటుం బాలను గుర్తిం చి పనులను అప్పగించారు. దీం తో వారంతా తట్టబుట్ట, గడ్డపార పట్టుకుని పనులకు బయలు దేరారు. ఉన్న ఉళ్లో పనిదొరక డంతో ఆకూలీల సంతోషం అంతాఇంతా కాదు.