ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు వణికిపోతుంటే మరోవైపు ఉగ్రవాదుల దాడులతో మరింత భయాంధోళనకు గురవుతున్నారు. లేటెస్టుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఓ మెటర్నిటీ ఆస్పత్రికిలో చొరబడి విచక్షణ రహితంగా జరిపారు. కాల్పుల్లో ఇద్దరు పసికందులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ కాబూల్‌లో ఆస్పత్రిలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు చికిత్స పొందుతున్న మహిళలు, అప్పుడే కళ్లు తెరిచిన పసికందులపై కాల్పులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అప్పుడే పుట్టిన చిన్నారులున్నారు. చనిపోయిన మిగతా 12 మందిలో బాలింతలు, నర్సులు ఉన్నారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

