మిలీషియా డిప్యూటీ కమాండర్​ అరెస్ట్

మిలీషియా డిప్యూటీ కమాండర్​ అరెస్ట్
భద్రాచలం, వెలుగు : చర్ల పోలీసులు బుధ వారం తాలిపేరు లెఫ్ట్ కెనాల్​వద్ద తనిఖీలు నిర్వ హించి మావోయిస్టు పార్టీ మిలీషియా డిప్యూటీ కమాండర్​ కారం సమ్మయ్యను అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ అంకిత్ ​కుమార్ ​శాంక్వర్​ కథనం ప్రకారం..పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్​పీఎఫ్​141 బెటాలియన్​ జవాన్లు కలిసి చర్ల మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాలిపేరు లెఫ్ట్ కెనాల్​వద్ద పోలీసులను చూసిన సమ్మయ్య పారిపోతుండగా పట్టుకున్నారు. 
 
ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చర్ల మండలంలో విధ్వంసం సృష్టించేందుకు పేలుడు పదార్థాలను తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. సీఐ రాజువర్మ ఉన్నారు.  ముగ్గురు మహిళా మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లా పోలీసుల ఎదుట బుధవారం ముగ్గురు మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. 

ఇందులో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్​ ఏరియా కమిటీకి చెందిన డిప్యూటీ కమాండర్​ మోతీ పోయం, సభ్యులు సంచిలా మండావి, లక్మీ పద్దం ఉన్నారు. మోతీపై రూ.5లక్షలు, మిగిలిన ఇద్దరు సంచిలా, లక్మీలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయి. ముగ్గురూ ఛత్తీస్​గఢ్​ నుంచి వెళ్లి మహారాష్ట్ర మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ముగ్గురికి రూ.25వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు.