పాలు, మాంసం ఉత్పత్తులు పెంచాలి: డాక్టర్ కె. ఇలంబర్తి

పాలు, మాంసం ఉత్పత్తులు పెంచాలి: డాక్టర్ కె. ఇలంబర్తి

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్​లోని పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ కె. ఇలంబర్తి హాజరయ్యారు. ప్రజలకు చౌకగా ప్రొటీన్లు అందించేందుకు పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులను పెంచాలన్నారు.  వీసీ ఎం. జ్ఞానప్రకాశ్, ఉద్యాన వర్సిటీ వీసీ డి. రాజిరెడ్డి పాల్గొన్నారు.