సీఎం, కార్మిక శాఖ మంత్రి ఫొటోలకు క్షీరాభిషేకం

సీఎం, కార్మిక శాఖ మంత్రి ఫొటోలకు క్షీరాభిషేకం

కల్లూరు, వెలుగు :   భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఫొటోలకు మండల ప్రైవేట్ ఎలక్ట్రీషన్ యూనియన్, పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణ మెయిన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్షీరాభిషేకం, పూలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రీషన్ యూనియన్, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.  రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో చేసిన పోరాటాఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలను గుర్తించి, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమాను రూ.6లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ జీవో జారీ చేనందుకు కృజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ జిల్లా నాయకులు బాలరాజు, మండల అధ్యక్షుడు పతకముడి నరసింహాచారి, వలసాల సురేశ్, కరుణాకర్ రావు, ఎస్​కే మోసిన్ పాషా, సీపీఐ మండల కార్యదర్శి దామాల దయాకర్ రావు, కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.కె మహబూబ్, ఎస్ కే జానిమియా, వజీర్మియా, నయీమ్  పాషా, చార్లెస్ , హరి తదితరులు పాల్గొన్నారు.