కోల్బెల్ట్: సీఎం, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

కోల్బెల్ట్: సీఎం, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం
  • సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా సౌకర్యం నేపథ్యంలో..

కోల్​బెల్ట్, వెలుగు: కోల్​మైన్స్​ పెన్షనర్లైన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, సింగరేణి సీఎండీ, డైరెక్టర్ల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు పార్క్​ఆవరణలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. 

ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వివేక్, సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ (పా) గౌతమ్​ పొట్రుకు విశ్రాంత ఉద్యోగులు, లీడర్లు కృతజ్ఞతలు తెలిపారు. 
కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఎ.గంగయ్య, పి.రాంరెడ్డి, మేడ రాజలింగు, బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కాటం లక్ష్మణ్, ఎ.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.