పాతబస్తీలో టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

పాతబస్తీలో టెన్షన్.. భారీగా మోహరించిన  పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎంఐఎం కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిరసనకారుల ఆందోళనతో పోలీస్ వాహనం ధ్వంసమైంది. దీంతో పాతబస్తీకి అదనపు బలగాలు తరలించారు. కార్యకర్తలను సర్దిచెప్పేందుకు యత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ వాహనంపై యువకులు రాళ్లు రువ్వారు. ముందస్తుగా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పాత బస్తీలో హై అలర్ట్ కొనసాగుతోంది.

ప్రభుత్వం నాపై కక్ష కట్టింది

రాజాసింగ్ ను రిలీజ్ చేయాలంటూ కోర్టు ఆదేశాలివ్వడంతో పోలీసులు  మంగళ్ ఘాట్ లోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ..  తెలంగాణ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయం తనవైపే ఉందని..త్వరలో  అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం తనకు న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చిందన్నారు.