
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ .. టీఆర్ఎస్ లో విలీనం అయితే.. రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మజ్లిస్ అవతరించనుంది. 2019 తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 88. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. MIMకు ఏడుగురు ఎమ్మెల్యేల బలముంది.
రాష్ట్రంలో మారిన పరిస్థితుల తర్వాత.. ఈ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. CLP విలీనానికి స్పీకర్ ఆమోదం తెలిపితే… కాంగ్రెస్ బలం 6కు పడిపోతుంది. ఏడుగురు ఎమ్మెల్యేల బలంతో ఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద రెండో రాజకీయ పార్టీ అవుతుంది.