గాంధీభవన్ రిమోట్... ఆర్ఎస్ఎస్ చీఫ్ చేతిలో ఉంది

 గాంధీభవన్ రిమోట్... ఆర్ఎస్ఎస్ చీఫ్ చేతిలో ఉంది
  • మూడోసారీ కేసీఆరే సీఎం

  •  అప్పుడు వైఎస్సార్ తో మాత్రమే ఉన్నం

  •  కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలే 

  • అజారుద్దీన్ ఫెయిల్డ్ పొలిటీషియన్

  • గోపీనాథ్ జూబ్లీహిల్స్ కోసం పని చేయలే

  •  అందుకే అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ను పెట్టాం

  • నిజామాబాద్ లో ఆర్ఎస్ఎస్ బలపడొద్దనే పోటీ చేస్తలేం

  • మీట్ ది ప్రెస్ లో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: కేసీఆర్ మూడో సారి సీఎం కావడం పక్కా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాము గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాత్రమే కలిసి పనిచేశామని, కాంగ్రెస్ పార్టీతో కాదని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అన్నారు. నిజామాబాద్ లో ఆర్ఎస్ఎస్ బలపడొద్దనే తాము ఎంఐఎం క్యాండిడేట్ ను పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ కు సహకరిస్తున్నట్టు సంకేతాలిచ్చారు. 

అజారుద్దీన్ గురించి మాట్లాడుతూ ఆయన ఓ మంచి క్రికెటర్ అని.. కానీ విఫల రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ ను చేసిందేమీ లేదని  కేటీఆర్ గుర్తు చేశారు. ఇకపోతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఏ మాత్రం నియోజకవర్గం కోసం పని చేయలేదన్నారు. అందుకే జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థి ని బరిలో నిలబెట్టింది అన్నారు. ఇకపోతే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీవితం ఆర్ఎస్ఎస్ తోనే ప్రారంభం అయ్యిందన్నారు. తెలంగాణ గాంధీ భవన్.. రిమోట్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు.